బాలయ్యా.. బ్లడ్ .. బ్రీడే కాదు..?

నందమూరి బాలకృష్ణకు ఎప్పుడూ బ్యాలన్స్ గా ఉండరు. ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు

Update: 2023-01-24 08:20 GMT

నందమూరి బాలకృష్ణకు ఎప్పుడూ బ్యాలన్స్ గా ఉండరు. ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు. తమ బ్రీడ్ వేరంటారు. బ్లద్ వేరంటారు. ఆయన తన బ్లడ్, బ్రీడ్ గురించి మాట్లాడుకుంటే తప్పు లేదు. ఎందుకంటే ఆయన బ్లడ్, బ్రీడ్ ఆయనకే తెలుసు. జనాలకు అవసరం లేదు కూడా. అవతల వారిని కించపర్చడం, చెంప చెళ్లుమనించడం బాలయ్యకు కొత్త కాదు. తాజాగా ఎస్వీరంగారావు, అక్కినేని నాగేశ్వరరావులపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆయన బ్లడ్.. బ్రీడే కాదు.. బిహేవియర్ కూడా తేడానే అన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

సోషల్ మీడియాలో....
సోషల్ మీడియాలో బాలకృష్ణను దుమ్మెత్తిపోస్తున్నారు. చిత్ర పరిశ్రమకు నందమూరి కుటుంబం ఒక్కటే పెట్టింది పేరా? మిగిలిన వారు ఎవరూ నటులు కారా? అయితే రామారావు సయితం ఎందుకు ఎన్నికల్లో ఓడిపోయారు? రామారావు స్థాపించిన పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ఇబ్బంది పడుతుంది.? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరణించిన వారిపైన కూడా బాలయ్య చేసిన వ్యాఖ్యలు దుమారాన్నే రేపుతున్నాయి. అక్కినేని, తొక్కినేని అంటూ బాలకృష్ణ చేసిన కామెంట్స్ సినీ పరిశ్రమలోనే కాదు రాజకీయంగా కూడా సంచలనంగా మారింది.
నోరే కాదు.. చేయి కూడా...
బాలకృష్ణకు నోరు దురుసని తెలుసు. అలాగే చేయి జారతాడని కూడా తెలుసు. తనను అభిమానించి దగ్గరకు వచ్చిన వాళ్లనే చెంప చెళ్లుమని అనిపించిన ఘనత బాలయ్య సొంతం. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా పెద్దగా పట్టించుకోరు. పోనీ తన తండ్రి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవలేదని, పార్టీని రక్షించుకోవడం కోసమేనని చేశానని చెప్పుకోవడం కూడా ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ మహానటులను తేలిగ్గా తీసిపారేస్తూ ఎలాగంటే అలా మాట్లాడటం మాత్రం ఆయన అభిమానులు సయితం అంగీకరించడం లేదు. బాలయ్య తాను ఏదో మహానటుడినని, పైనుంచి దిగి వచ్చి భ్రమిస్తుండటం వల్లనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
నాగ చైతన్య కౌంటర్....
వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో ఈ వ్యాఖ్యలు చేసిన బాలయ్య అన్యాపదేశంగా అన్నాడా? కావాలని అన్నాడా? అన్నది పక్కనపెడితే.. ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి నటులను అగౌరపర్చినట్లే. వారి అభిమానులకకు ఆగ్రహం తెప్పించినట్లే. ఎన్టీఆర్ నేర్పిన సంస్కారం ఇదేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చివరకు అక్కినేని కుటుంబం నుంచి నాగ చైతన్య స్పందించారు. ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఏఎన్నార్ లుతెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలని, వారిని గౌరవించడం సంస్కారమని అని బాలయ్య కామెంట్స్ కు కొద్దిగా కటువుగానే కౌంటర్ ఇచ్చాడు. మరి బాలయ్య తన వ్యాఖ్యలపై ఎలాంటి వివరణ ఇస్తారనేది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News