Pawan kalyn : పవన్ కు మరో షాక్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రాజమండ్రి పోలీసులు మరో షాక్ ఇచ్చారు. బాలాజీ సెంటర్లో సభను ఏర్పాటు చేయడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. తొలుత పవన్ [more]

Update: 2021-10-01 13:07 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రాజమండ్రి పోలీసులు మరో షాక్ ఇచ్చారు. బాలాజీ సెంటర్లో సభను ఏర్పాటు చేయడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. తొలుత పవన్ కల్యాణ్ కాటన్ బరాజ్ పై శ్రమదానం చేయాలని నిర్ణయించారు. ఇరిగేషన్ శాఖ అనుమతిని నిరాకరించడంతో పవన్ కల్యాణ్ శ్రమదానాన్ని బాలాజీ సెంటర్ కు మార్చారు. అక్కడ శ్రమదానం చేసి బహిరంగ సభను నిర్వహించాలనుకున్నారు. అయితే శ్రమదానం వరకూ ఒకే గాని, సభకు మాత్రం అనుమతి ఇవ్వమని పోలీసులు చెప్పారు. సభా వేదికను మార్చుకోవాలని రాజమండ్రి పోలీసులు జనసేన పార్టీ నేతలకు సూచించారు.

Tags:    

Similar News