అయోధ్యలో రాములవారి ప్రతిష్ఠ ఎప్పుడంటే..?

హిందువులంతా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠ తేదీని అయోధ్య రామ మందిరం ట్రస్ట్‌ ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 22న సీతాసహిత, రామలక్ష్మణుల విగ్రహాలను అయోధ్యలోని రామమందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించనున్నారు. ట్రస్ట్‌ జనరల్‌ సెక్రటరీ చంపత్‌ రాయ్‌, ఇతర సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్రమోదీని రాములవారి విగ్రహ ప్రతిష్ఠకు ఆహ్వానించారు.

Update: 2023-10-25 15:44 GMT

‘ఈ రోజు ట్రస్ట్‌లోని ఇతర సభ్యులతో కలిసి ప్రధాని మోదీని కలిశాం. గర్భగుడిలో జరగనున్న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు ఆయనను ఆహ్వానించాం. ప్రధాని మోదీ వెంటనే అంగీకరించారు. ఆ రోజు రాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది’ అని చంపత్‌ రాయ్‌ చెప్పారు.

‘జై శ్రీరామ్‌. ఈ రోజంతా భావోద్వేగాలతో గడిచింది. రామజన్మభూమి ట్రస్ట్‌ సభ్యులు నా ఇంట్లో నన్ను కలిశారు. రాముని విగ్రహ ప్రతిష్ఠకు ఆహ్వానించారు. నా జీవితానికి దక్కిన గొప్ప అదృష్టం ఇది. ఆ చారిత్రక ఘట్టానికి సాక్షిగా హాజరవుతాను’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ (ఒకప్పటి ట్విటర్‌) ద్వారా ప్రకటించారు.

ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రామమందిర నిర్మాణం శరవేగంగా పూర్తవుతోంది. దేశం నలుచెరుగుల నుంచి మందిర నిర్మాణానికి నిధులు వెల్లువెత్తాయి. 2020లో నరేంద్ర మోదీ స్వయంగా రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ళలో నిర్మాణం పూర్తి చేసుకున్న అయోధ్య రామ మందిరం రాబోయే రోజుల్లో ఓ పెద్ద ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మారనుంది.

Tags:    

Similar News