ఎండదెబ్బకు పాదయాత్రలో మార్పులు.. అర్ధరాత్రి వరకూ
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ కొనసాగనుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ కొనసాగనుంది. నంద్యాల నియోజకవర్గంలో జరగనుంది. యువగళం నేటికి 102 వ రోజుకు చేరుకుంది. సాయంత్రం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 4గంటలకు మూలమఠం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. 4.10 గంటలకు నంద్యాల చెరువు వద్ద స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. 4.45 గంటలకు ఆత్మకూరు బస్టాండు చౌరస్తాలో స్థానికులతో సమస్యలపై చర్చిస్తారు. 5.05 గంటలకు మహనందేశ్వరస్వామి గుడి వద్ద స్థానికులతో సమావేశమవుతారు.
వివిధ వర్గాలతో...
5.25 గంటలకు జామియా మసీదు వద్ద ముస్లింలతో సమావేశవై వారి సమస్యలపై నారా లోకేష్ చర్చించనున్నారు. 5.45 గంటలకు గాంధీ చౌక్ లో స్థానికులతో సమావేశం కానున్నారు. 6 గంటలకు కల్పన సెంటర్ లో బంగారుషాపు యజమానులతో సమావేశమవుతారు. 6.10 గంటలకు సాయిబాబాగుడి వద్ద బొందిలి, మంజు పీర్ దర్గా ప్రతినిధులతో భేటీ అవుతారు. 6.30 గంటలకు శ్రీనివాస సెంటర్ లో స్థానికులతో మాటామంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. 6.40 గంటలరే రాజ్ థియేటర్ సర్కిల్ లో బహిరంగసభలో లోకేష్ ప్రసంగిస్తారు.
రాత్రి 11.45 గంటల వరకూ...
రాత్రి 7.45 గంటలరే పద్మావతి నగర్ ఆర్చి వద్ద వాల్మీకి సామాజికవర్గీయులతో సమావేశం కానున్నారు. 8.05 గంటలకు టెక్కె మార్కెట్ యార్డు వద్ద మున్సిపల్ వర్కర్లతో సమావేశం కానున్నారు. 8.15 గంటలరే ఎస్ బిఐ సర్కిల్ లో స్థానికులతో సమావేశం కానున్నారు. 8.25 గంటలకు ఫైర్ స్టేషన్ వద్ద దివ్యాంగులతో సమావేశమై వారి సమస్యలపై హామీలు ఇవ్వనున్నారు. 8.35 గంటలకు టుటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద న్యాయవాదులతో సమావేశం అవుతారు. 8.50 గంటలకు సాయిబాబానగర్ ఆర్చి వద్ద ఆటోవర్కర్లతో సమావేశం కానున్నారు. రాత్రి 9:00 గంటలకు గవర్నమెంట్ హాస్పటల్ వద్ద హెల్త్ వర్కర్స్ తో సమావేశం అవుతారు. 9.10 గంటలకు ఎన్ జిఓ కాలనీలో స్థానికులతో సమావేశం అవుతారు. 9:20 గంటలకు నూనెపల్లి ఫ్ల్రైఓవర్ వద్ద గాంధీనగర్, బొగ్గు లైన్ మరియు అయ్యలూరు స్థానికులతో సమావేశం అవుతారు. రాత్రి10 గంటలకకు నూనెపల్లి ఫ్ల్రైఓవర్ వద్ద కార్మికులతో సమావేశం అవుతారు.రాత్రి 11.40 గంటలకు యాతం ఫంక్షన్ హాలు వద్ద బస చేయనున్నారు.