పసుపు చొక్కా విప్పి పడేసిన మాజీ ఎమ్మెల్యే
తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల చిచ్చు తారస్థాయికి చేరింది. నిన్న అర్థరాత్రి తర్వాత తుది జాబితా విడుదల చేయడంతో ఇవాళ ఉదయం నుంచి టిక్కెట్లు దక్కని నేతలు అసమ్మతి [more]
తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల చిచ్చు తారస్థాయికి చేరింది. నిన్న అర్థరాత్రి తర్వాత తుది జాబితా విడుదల చేయడంతో ఇవాళ ఉదయం నుంచి టిక్కెట్లు దక్కని నేతలు అసమ్మతి [more]
తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల చిచ్చు తారస్థాయికి చేరింది. నిన్న అర్థరాత్రి తర్వాత తుది జాబితా విడుదల చేయడంతో ఇవాళ ఉదయం నుంచి టిక్కెట్లు దక్కని నేతలు అసమ్మతి గళం విప్పుతున్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే టిక్కెట్ ను పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు ఇవ్వడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే రామారావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… పక్క జిల్లా నుంచి తీసుకువచ్చి కొవ్వూరులో ఎలా అభ్యర్థిని పెడతారని ప్రశ్నించారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, అయినా గుర్తింపు లేదన్నారు. తనలాంటి కష్టపడే వారికి మళ్లీ అన్యాయం జరగొద్దని, మిగతా వారికి కనువిప్పు కావాలని పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన వేసుకున్న పసుపు చొక్కను విడిచిపడేసి ఆయన నిరసన తెలిపారు.