ఆత్మకూరు టిక్కెట్ ఖరారయింది

మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు నియోజకవర్గం ఎమెల్యే సీటు ఖాళీ అయింది. స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు.

Update: 2022-02-26 07:19 GMT

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు నియోజకవర్గం ఎమెల్యే సీటు ఖాళీ అయింది. అసెంబ్లీ అధికారులు ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఆత్మకూరు ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. దీంతో ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమయింది. దీంతో మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబంలో నుంచే ఒకరిని జగన్ అభ్యర్థిగా ఎంపిక చేయాల్సి ఉంది.

హఠాన్మరణంతో....
మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో జరగనున్న ఉప ఎన్నిక కావడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. విపక్షాలు కూడా పోటీకి దింపే అవకాశాలు లేవు. మేకపాటి గౌతమ్ రెడ్డి అందరి వాడుగా పేరుపొందడం, వివాద రహితుడిగా ఉండటంతో ఈ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు విపక్షాలు సయితం ముందుకు రావు. ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ కొంత బలంగా ఉన్నప్పటికీ ఉప ఎన్నికలలో పోట చేసే అవకాశాలు లేవనే చెప్పాలి.
ఆమెకే అవకాశాలు...
దీంతో మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీకీర్తి రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించే అవకాశాలున్నాయి. గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డి వయసు మీద పడటంతో ఆయన ఎన్నికకు సుముఖత వ్యక్తం చేయరు. దీంతో శ్రీకీర్తి రెడ్డి వైపు జగన్ మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. మేకపాటి గౌతమ్ రెడ్డి కుమారుడు కూడా చిన్న వయసు కావడంతో శ్రీకీర్తి రెడ్డిని ఎమ్మెల్యేగా చేయాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు....
మేకపాటి గౌతమ్ రెడ్డి దశ దిన కర్మ పూర్తయిన తర్వాత దీనిపై కుటుంబ సభ్యుల నుంచి వైసీపీ హైకమాండ్ ఒక క్లారిటీ తీసుకునే అవకాశముంది. శ్రీకీర్తి రెడ్డి అయితేనే ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయడం సరైన నిర్ణయమని పార్టీ నెల్లూరు జిల్లా నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. దీంతో శ్రీకీర్తి రెడ్డిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశముంది. ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయిన ఆరు నెలల లోపు ఎన్నిక జరగాల్సి ఉంది.




Tags:    

Similar News