కుమారస్వామి సంచలన ప్రకటన.. విశాఖ ఉక్కుపై ఆయన ఏమన్నారంటే?
విశాఖ ఉక్కును మళ్లీ పునరుద్ధరిస్తామని కేంద్ర మంత్రి కుమారస్వామి తెలిపారు.;

విశాఖ ఉక్కును మళ్లీ పునరుద్ధరిస్తామని కేంద్ర మంత్రి కుమారస్వామి తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ నిలదొక్కుకునేందుకు 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఇచ్చామని తెలిపారు. కార్మికుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలిగించబోమని కుమారస్వామి తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగదని ఆయన అన్నారు.
అప్పులు ఉన్నప్పటికీ...
ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ కు 35 వేల కోట్ల అప్పులున్నాయని, విశాఖ ఉక్కును తరిగి పునరుద్ధరిస్తామని ఆయన తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఆపరేషనల్ బ్రేక్ ఈవెన్ సాధిస్తామని కూడా మంత్రి కుమారస్వామి తెలిపారు. అయితే పూర్తి స్థాయి విస్తరణకు కొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు. దశలవారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. కేవలం గనుల కేటాయింపు మాత్రమే కాదు అన్ని సమస్యలకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని మంత్రి కుమారస్వామి తెలిపారు.