Visakha : నేడు ఊటీకి విశాఖ వైసీపీ కార్పొరేటర్లు
విశాఖ నగరపాలక సంస్థకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు నేడు ఊటికి బయలుదేరి వెళుతున్నారు.;

విశాఖ నగరపాలక సంస్థకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు నేడు ఊటికి బయలుదేరి వెళుతున్నారు. విశాఖ మేయర్ పై టీడీపీ కూటమి అవిశ్వాసం తీర్మానం ఇవ్వడంతో తమ వర్గానికి చెందిన కార్పొరేటర్లను క్యాంప్ నకు తరలించాలని వైసీపీ నిర్ణయించింది. మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జి కన్నబాబులు వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు.
క్యాంప్ లోకి కార్పొరేటర్లు...
అధికార పార్టీ బెదిరింపులకు, ప్రలోభాలకు పాల్పడుతూ తమ వర్గానికి చెందిన కార్పొరేటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుందని వారు ఆరోపించారు. తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లను తాము కాపాడుకుంటామని వారు చెప్పారు. అందులో భాగంగా ఈరోజు విశాఖ నుంచి వైసీపీ కార్పొరేటర్లను ఊటీకి తరలించనుంది. జగన్ తో మాట్లాడిన తర్వాత వారిని క్యాంప్ నకు తరలించాలని నిర్ణయించారు.