సైనా నెహ్వాల్ కు కలిసొచ్చిన అదృష్టం
సైనా నెహ్వాల్ మంగళవారం నాడు హాంకాంగ్‌కు చెందిన చియుంగ్ న్గాన్ యిపై స్ట్రెయిట్ గేమ్
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సైనా నెహ్వాల్ మొదటి రౌండ్ లో మంచి విజయం అందుకోగా.. ఇప్పుడు అదృష్టం కూడా కలిసి వచ్చింది. మంగళవారం ఉదయం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో హాంకాంగ్‌కు చెందిన చెయుంగ్ న్గన్ యిపై 21-19, 21-9తో ఓడించింది. రెండో రౌండ్‌లో జపాన్‌కు చెందిన ఆరవ సీడ్, టైటిల్ గెలిచే సత్తా ఉన్న నవోమి ఒకుహరాతో తలపడాల్సి ఉండగా.. ఆఖరి నిమిషంలో ఒకుహరా గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంది. దీంతో సైనాకు థర్డ్ రౌండ్‌కు బై లభించింది. మూడో రౌండ్‌లో సైనా నెహ్వాల్.. థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్, జర్మనీకి చెందిన వైవోన్ లీ మధ్య విజేతతో తలపడనుంది.
సైనా నెహ్వాల్ మంగళవారం నాడు హాంకాంగ్‌కు చెందిన చియుంగ్ న్గాన్ యిపై స్ట్రెయిట్ గేమ్ విజయంతో తన BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్ ను ఘనంగా మొదలు పెట్టింది. న్గాన్ యిని ఓడించడానికి సైనాకు 38 నిమిషాల సమయం పట్టింది. వరల్డ్స్ లో రజతం, కాంస్యం నెగ్గిన 32 ఏళ్ల సైనా మునుపటి స్థాయిలో రాణించడం విశేషం. ఆమె రెండవ రౌండ్ ప్రత్యర్థి నోజోమి ఒకుహరా గాయం కారణంగా టోర్నమెంట్ నుండి వైదొలగడంతో ప్రీ-క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడానికి బై పొందింది. సైనా ఎంతో జాగ్రత్తగా.. మునుపటి ఫామ్ ను అందుకోవడం విశేషం. సైనా ప్రపంచ ఛాంపియన్ అనే విషయాన్ని ప్రత్యర్థులు గుర్తు పెట్టుకునే ఉంటారు. అందుకు తగ్గట్టుగా సైనా రాణిస్తే టైటిల్ ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.