Ap Election Exit Polls : పురుషులలో అధిక శాతం టీడీపీ వైపు మొగ్గు.. జగన్ కు జై కొట్టిన మహిళలు

ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జిట్ ఫలితాలు వచ్చాయి. ఎక్కువ సంస్థలు వైసీపీ వైపు మొగ్గు చూపాయి.

Update: 2024-06-01 14:07 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జిట్ ఫలితాలు వచ్చాయి. ఎక్కువ సంస్థలు వైసీపీ వైపు మొగ్గు చూపాయి. అయితే పురుష ఓటర్లు ఎక్కువగా టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపిందని తేల్చాయి. అలాగే మహిళల్లో అధిక శాతం మంది ఓటర్లు వైసీపీ వైపు నిలబడ్డారని తేల్చాయి. వైసీపీకి పురుషుల్లో 51 శాతం మంది ఓట్లు వేస్తే, మహిళల్లో 41 శాతం మంది మాత్రమే వైసీపీ వైపు మొగ్గు చూపారని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. సంక్షేమ పథకాల వైపు మహిళలు ఎక్కువగా అధికార వైసీపీ వైపు నిలబడితే.. పురుషులు మాత్రం అభివృద్ధి, ఇతర కారణాలు కూడా టీడీపీ వైపు నిలిచారని అనేక సంస్థలు తెల్చాయి.

ఏబీసీ సీ ఓటరు ప్రకారం...
ఏబీసీ - సీఓటరు 97 నుంచి 108 స్థానాల్లో వైసీపీకి వస్తాయని అంచనా వేసింది. టీడీపీ కూటమికి 67 నుంచి 78 సీట్లు వస్తాయని తెలిపింది. అయితే ఇదే సంస్థ ఇరవై సీట్లు ఎన్డీఏ కూటమికి 21 నుంచి 25 నాలుగు స్థానాలు వస్తే, వైసీీపీకి కేవలం నాలుగు స్థానాలు మాత్రమే వస్తాయని తెలిపింది. అయితే ఈ సంస్థ రెండు వేర్వేరు ఫలితాలు వెల్లడించడంతో క్రాస్ ఓటింగ్ జరగిందని తెలిపింది. దీని బట్టి బీజేపీ పొత్తు పెట్టుకోవడం అది ఆ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో లాభించింది. అదే సమయంలో బీజేపీతో పొత్తు కారణంగా తెలుగుదేశం పార్టీ దెబ్బతినిందన్న విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి.


Tags:    

Similar News