Ys Jagan : పేదల భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలు ఇవీ

పేదల భవిష్యత్ ను నిర్ణయించేది ఈ ఎన్నికలేనని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కావలిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు

Update: 2024-04-06 12:27 GMT

పేదల భవిష్యత్ ను నిర్ణయించేది ఈ ఎన్నికలేనని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కావలిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మోసగాళ్లంతా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్నారు. మోసగాళ్ల కూటమికి వ్యతిరేకంగానే తన పోరాటమని తెలిపారు. అందరి ప్రయోజనాలను రక్షించుకునేందుకు మీరు సిద్ధమా? అని జగన్ ప్రశ్నించారు. ఈఎన్నికలు జగన్ కు, చంద్రబాబుకు మధ్య జరిగే ఎన్నికలు కావని, పేదలకు, పెత్తందార్లకు మధ్య జరిగే యుద్ధమని ఆయన అన్నారు. మోసగాళ్లంతా చంద్రబాబు పక్షమేనని అన్నారు. ఒక జాతీయ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టిందన్న జగన్ ఈ యుద్ధంలో తాను ఎప్పుడూ పేదల పక్షమేనని అన్నారు.

అందరూ కలసి...
మరొక జాతీయ పార్టీ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిందన్నారు. ఎన్నికలకు ముందు మ్యానిఫేస్టో చూపించే చంద్రబాబు ఎన్నికల తర్వాత చూపించడని అన్నారు. మ్యానిఫేస్టోలో చెప్పిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడన్నారు. పది శాతం హామీలను అమలు చేశానని చెప్పే ధైర్యం ఉందా? అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబూ.. మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన నువ్వు నీ మార్క్ అంటూ ఒకటి చెప్పుకోగలవా? అని జగన్ నిలదీశారు. 30 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ప్రజలను ఓటు అడిగేటప్పుడు తాను ఈ మంచి చేశానని ఎందుకు చెప్పలేకపోతున్నారన్నారు.
ప్రజలను మభ్యపెడుతూ...
ప్రజలను మభ్య పెడుతూ జనం ముందుకు వచ్చి తాను గతం గురించి చెప్పకుండా అధికారంలోకి వస్తే ఓటేస్తే ఇంటికి కిలో బంగారం, బెంజి కారు ఇస్తానని చెబుతాడని ఎద్దేవా చేశారు. సూపర్ సిక్స్ అంటూ మీ ముందుకు వచ్చే చంద్రబాబును చూసి నమ్మలా? అని జగన్ ప్రశ్నించారు. మోసం, వెన్నుపోటు, కుట్ర, అబద్ధం అన్నీ కలిపితే చంద్రబాబు అని అన్నారు. ప్రజలతో ఆయన బంధం అతకని బంధం అని అన్నారు. ప్రజలకు మంచి చేసి ఉంటే మూడు పార్టీలతో పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. ఇంటింటికి మంచి చేస్తేనే వైసీపీకి ఓటు వేయమని తాను అడుగుతున్నానని అన్నారు. తొలిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికై 58 నెలల పరిపాలనలోనే ఇంత మంచి చేశాడన్నారు. ఇంటింటికీ పౌరసేవలు డోర్ డెలివరీ చేస్తున్నానని తెలిపారు.


Tags:    

Similar News