Ap Elections : ఏపీ ఎన్నికల ఫలితాలపైన.. ఎవరిది అధికారమన్నది ఎన్నిగంటలకు క్లారిటీ వస్తుందంటే?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కౌంటింగ్ సమయం దగ్గరపడింది. అందుకు తగిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కౌంటింగ్ సమయం దగ్గరపడింది. అందుకు తగిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. అయితే ఈసారి ఏపీ ఎన్నికలు అంచనాలకు అందడం లేదు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కూడా ముందుగా అంచనా వేయలేకపోతున్నారు. పెద్దయెత్తున పోలింగ్ జరగడంతో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది మాత్రం ఇంకా గందరగోళంలోనే ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు. కూటమి అధికారంలోకి రావడంపై అభ్యంతరమూ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది.
ఉదయం పదకొండు గంటలకు...
ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితంవస్తుందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. ఫస్ట్ సైనికదళాల్లో పనిచేసే సర్వీసు ఓటర్లకు సంబంధించి వచ్చిన ఓట్లు లెక్కిస్తారు. తర్వాత పోస్టల్ బ్యాలట్ పత్రాల్లోని ఓట్లు లెక్కింపు జరుపుతారు. 8.30 గంటలకు ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. సగటున ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య ఫలితాలపై కొంత స్పష్టత వస్తుంది. ఎవరు అధికారంలోకి వస్తారన్నది ఉదయం పదొకొండు గంటలకు తేలనుంది. ట్రెండ్ ను బట్టి సులువుగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పేయవచ్చు.