Ap Elections : ఉండి.. ఉండుండి.. ఇలా మారిపోయిందేంటి చెప్మా? నలుగురి రాజుల్లో గెలుపెవరిది?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. ఇక గెలుపోటములపై భారీగా బెట్టింగ్ లు జరుగుతున్న నియోజకవర్గం ఉండి

Update: 2024-05-17 06:59 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. ఇక గెలుపోటములపై భారీగా బెట్టింగ్ లు జరుగుతున్న నియోజకవర్గం ఉండి. ఇక్కడ నలుగురు కీలకమైన నేతలు పోటీ పడుతున్నారు. ఉండి నియోజ‌క‌వ‌ర్గం.. రాజ‌కీయంగా టెన్షన్ పెడుతున్న కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం. ఉమ్మడి ప‌శ్చిమ గోదా వ‌రి జిల్లాలోని ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు.. మ‌రోమాట‌లో చెప్పాలంటే.. షెడ్యూల్ వ‌చ్చేసి.. నామినేష‌న్ల ప్రక్రియ కూడా.. ప్రారంభ‌మైన త‌ర్వాత కూడా .. టెన్షన్ పెట్టిన నియోజ‌క‌వ‌ర్గం. టీడీపీ టికెట్‌ను చివ‌రి నిముషంలో ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజుకు కేటాయించారు. దీనికి అనేక ఇబ్బందు లు కూడా వ‌చ్చాయి. అయినా.. చంద్రబాబు ర‌ఘురామ‌వైపే మొగ్గు చూపించారు

నలుగురూ...
ఇక‌, వైసీపీ నుంచి పీవీఎల్ న‌ర‌సింహ‌రాజు బ‌రిలో ఉన్నారు. అయితే.. పోటీ అటు టీడీపీ, ఇటు వైసీపీల మ‌ధ్యే సాగుతుందా? అంటే.. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల మాదిరిగా ఇక్కడ అలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. స్వతంత్ర అభ్యర్థిగా క‌లువ‌పూడి శివ పోటీలో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా.. బ‌ల‌మైన నాయ‌కుడు.. వేగేశ్న వెంక‌ట గోపాల కృష్ణంరాజుకు టికెట్ ఇచ్చింది. అంటే.. ద్విముఖంగా ఉండాల్సిన పోరు.. చ‌తుర్ముఖం అయిపోయింది. అంద‌రూ బ‌ల‌మైన క్షత్రియ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులే కావ‌డం.. ఆర్తికంగా కూడా బ‌లంగా ఉండ‌డంతో పోటీ మాత్రం మామూలుగా లేదు.
పాతుకుపోతారని...
సానుభూతి కోణంలో చూసుకున్నా.. ర‌ఘురామ‌, క‌లువ‌పూడి శివ‌లు పోటీ ప‌డుతుండ‌డం వంటివి.. ఎన్ని క‌ల‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దీంతో ఇక్కడ ఎవ‌రూ కూడా ఏక‌ప‌క్షంగా విజ‌యం ద‌క్కించుకు నే ప‌రిస్థితి లేదన్న అంచనాలు బలంగా వినపడుతున్నాయి. నిజానికి.. కొంత మేర‌కు వైసీపీకి క‌లిసి వ‌స్తుంద‌నే అంచ‌నాలు ఉన్నా.. నాయ‌కులు పెర‌గ‌డం.. పోటీ తీవ్రంగా ఉండ‌డంతో అధికార పార్టీ వెనుక‌బ‌డిందని అంటున్నారు. పోనీ.. ర‌ఘురామ‌కు న్యాయం జ‌రుగుతుందా? అంటే.. టీడీపీలో ప‌రిస్థితి గుంభ‌నంగా మారింది. రఘురామ కృష్ణరాజు ఒకసారి ఇక్కడ గెలిస్తే పాతుకుపోతారని టీడీపీ నేతలే ఆయనకు సహకరించలేదంటారు.
ఎవరు గెలిచినా...
త‌మకు టికెట్ ఇవ్వలేద‌ని.. రామ‌రాజు.. మౌనంగా ఉన్నారు. పైకి రఘురామ కృష్ణరాజుకు ప్రచారం చేసినా ఆయన వర్గం మాత్రం రఘురామకు దూరంగా ఉందన్న టాక్ బలంగా వినిపిస్తుంది. ఇక‌, టికెట్ ద‌క్కని శివ‌రామ‌రాజు.. ఇండిపెండెంట్‌గా బ‌రిలో నిలిచారు. ఇద్దరికీ కూడా.. భారీ అనుచ‌ర గ‌ణం ఉంది. పైగా.. ర‌ఘురామ‌ను గెలిస్తే.. త‌మ‌కు ప్రయోజ‌నం లేద‌ని.. పైగా.. ఏకుమేక‌వుతాడ‌నే అంచ‌నాలు.. రామ‌రాజు వ‌ర్గంలో క‌నిపిస్తోంది. దీంతో క‌లువపూడి శివ‌వైపు వారు చూస్తున్నారు. పైకి ఎవ‌రూ మాట్లాడ‌క‌పోయినా.. ర‌ఘురామ‌కే జై కొడుతున్నా.. అంత‌ర్గతంగా మాత్రం.. అంద‌రూ.. క‌లువ‌పూడి వైపే ఉన్నారు. దీంతో ఉండిలో నాలుగు స్తంభాలాట ర‌స‌వ‌త్తరంగా సాగుతోంది. ఎవ‌రు గెలిచినా.. వెయ్యి రెండు వేల మెజారిటీని మించే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు




Tags:    

Similar News