Ys Jagan : 36 గంటల్లో సమరం.. చంద్రబాబు టీం కుట్రలు విన్నారా?
లంచాలు, వివక్ష లేకుండా జరిగిన పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
లంచాలు, వివక్ష లేకుండా జరిగిన పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందా? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చిలకలూరిపేటలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఈరోజు రాష్ట్రంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతుందన్నారు. నేడు రాష్ట్రంలో పేదవాడు ఒకవైపు ఉంటే.. మరొక వైపు పెత్తందారులున్నారన్నారు. రెండు నెలల క్రితం వరకూ అవ్వాతాతలకు ఇంటివద్దకే వచ్చే పింఛను కుట్రలు చేసి ఆపించి వారిని ఇబ్బంది పెట్టారన్నారు. వాళ్ల ఉసురు చంద్రబాబుకు తగులుతుందని జగన్ శాపనార్థాలు పెట్టారు. ఢిల్లీ పెద్దలతో కుట్రలు చేసి రావాల్సిన పథకాలను కూడా అందచేయకుండా అడ్డం తగులుతున్నారన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ డబ్బులు ఇస్తారట అంటూ జగన్ అన్నారు.
తమ ప్రభుత్వం చేసిన...
మరో 36 గంటల్లో ఎన్నికల సమరం ప్రారంభం కాబోతుందన్నారు. తాను చేసిన మార్పులు గ్రామాల్లో కనిపిస్తున్నాయన్నారు. పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఏ పథకమైనా గుర్తుకు వస్తుందా? అని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తెచ్చామన్నారు. వైద్యరంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు తెచ్చి పేదలకు ఆరోగ్యాన్ని దరి చేర్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఇన్ని మంచి పనులు చేసిన తాను ఓట్లు అడుగుతున్నానని, చంద్రబాబు ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారని జగన్ అన్నారు. అక్కచెల్లెమ్మల పేరిట ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో 2.75 లక్షల కోట్ల నగదను పంపిణీ చేశామన్నారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనైనా ఇలా నగదును మీ బ్యాంకు ఖాతాల్లో వేసిన దాఖలాలున్నాయా? అంటూ జగన్ ప్రజలను ప్రశ్నించారు.
మరోసారి మాయ మాటలు చెప్పేందుకు...
అయినా పరవాలేదు.. తనకు కావాల్సింది అక్క చెల్లెళ్ల మొహంలో ఆనందం చూడటం. రైతుల మొహంలో ఆనందం చూడటమే కావాలి. తాను మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే బటన్ నొక్కి పథకాలను పంచుతానని అన్నారు. అసైన్ మెంట్ ల్యాండ్ మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు. బాలకృష్ణ విశాఖలో పదుల ఎకరాల భూమిని కొన్నారని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో తెలుసా? అని ప్రశ్నించారు. 2014లో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినట్లుగానే మరోసారి మోసం చేయడానికి ముగ్గురు కలసి వస్తున్నారన్నారు. ఈసారి నమ్ముతారా? అంటూ జనాలను జగన్ అడిగారు. ఏ ఒక్కరూ చంద్రబాబు మాటలను నమ్మి మోసపోవద్దని అన్నారు. నొక్కిన బటన్ ల డబ్బులు అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి రావాలన్నా, వాలంటీర్లు ఇంటికి రావాలన్నా, పథకాలు కొనసాగాలన్నా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు.