Pawan Kalyan : ప్రతిజ్ఞ పూనాడు.. పాతాళానికి తొక్కేస్తానన్నాడు.. చేసి చూపించాడు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుకున్నది సాధించాడు. ఫ్యాన్స్ తో పాటు యువతను కూడా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు

Update: 2024-06-04 08:11 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుకున్నది సాధించాడు. జగన్ నిన్ను గెలవనివ్వను.. పాతాళంలోకి తొక్కేస్తా అని ప్రతిజ్ఞ చేసిన పవన్ కల్యాణ్ దానిని నిలబెట్టుకున్నాడు. గత కొన్నేళ్ల నుంచి కేవలం అభిమానంతోనే సరిపుచ్చి ఓటు వేయలేదనే దాని నుంచి అన్ని ఓట్లను గంపగుత్తగా కూటమికి తరలించడంలో జనసేనాని సక్సెస్ అయ్యారు. ఎంతగా అంటే ఏపీలో కాపు, కమ్మ సామాజికవర్గం కెమెస్ట్రీ పవన్ కల్యాణ‌్ కారణంగానే వర్క్ అవుట్ అయింది. గతంలో ఏ ఎన్నికలలో లేని విధంగా కాపు సామాజికవర్గం ఓటర్లు 90 శాతం మంది జనసేనానిని చూసే కూటమి అభ్యర్థికి ఓట్లు వేశారని చెప్పాలి. ఎందుకంటే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అభ్యర్థుల మెజారిటీ చూస్తుంటే ఇదే అర్థమవుతుంది.

కాపు సామాజికవర్గం...
మూడు పార్టీలు.. మూడు గుర్తులు... కొంత గందరగోళం అని అనుకున్నా .. సక్సెస్ ఫుల్ గా గుర్తులను బలంగా జనంలోకి తీసుకెళ్లారు. ఎంతగా అంటే ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా చూడగలిగారు. అదే సమయంలో గుర్తులను గుర్తు పట్టి కూటమి తరుపున అభ్యర్థులకు ఓటు వేసేలా ఆయన చేసిన కృషి ఫలించిందనే చెప్పాలి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ కాపులు, బలిజ ఇలా ఏ రకంగా అనుకున్నప్పటికీ వారంతా కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసేందుకు పవన్ చరిష్మా ఉపయోగపడిందని చెప్పాలి. ఈసారి కాకుంటే... ఇక తమ సామాజికవర్గానికి రాజకీయంగా ప్రాధాన్యత ఉండదని భావించి కాపులు అందరూ ఏకమయ్యారు.
యువతతో...
దీంతో పాటు పవన్ ఫ్యాన్స్ తో పాటు యువతను కూడా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. యువ ఓటర్లతో పాటు కొత్తగా ఓటర్లుగా చేరిన వాళ్లంతా కూటమి వైపు మొగ్గు చూపారు. పవన్ కల్యాణ‌్ అంటూ లేకపోతే ఈ ఎన్నికల్లో ఇంత ల్యాండ్ స్లయిడ్ విక్టరీ కూటమికి లభించేది కాదన్నది అందరూ అంగీకరించే విషయం. పవన్ కల్యాణ్ కసితో ప్రతి అంశంలో జగన్ ను వ్యతిరేకిస్తూ జనంలోకి వెళ్లడంతో పాటు కూటమి ఏర్పాటు చేయడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఇలాంటి తరుణంలో పవన్ కల్యాణ్ పాత్రను ఏపీ రాజకీయాల్లో తక్కువ చేసి చూడలేం. ఎందుకంటే రానున్న కాలంలో పవన్ బలీయమైన శక్తిగా ఎదుగుతారని మాత్రం చెప్పాలి. ఇటు అధికారంలోకి వచ్చినా పవన్ ను చంద్రబాబు నిర్లక్ష్యం చేయలేని పరిస్థితి నెలకొంది.


Tags:    

Similar News