Allu Arjun : నంద్యాల పర్యటన వివాదం.. బన్నీపై కేసు నమోదు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. నంద్యాలలో నిన్న ఆయన ఎన్నికల ప్రచారం వివాదంగా మారింది;

Update: 2024-05-12 01:36 GMT

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. నంద్యాలలో నిన్న ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేపథ్యంలో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ పర్యటనకు సంబంధించి ముందస్తుగా రిటర్నింగ్ అధికారి నుంచి అనుమతి పొందలేదన్న కారణంగా ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా అల్లు అర్జున్ నిన్న నంద్యాల చేరుకున్నారు. శిల్పా రవి ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ చేశారు. అనంతరం అభిమానులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వేలాది మంది గుమిగూడారు.

అనుమతి లేకుండా...
అయితే అల్లు అర్జున్ ను చూసేందుకు పెద్దయెత్తున అభిమానులు తరలి రావడంతో పోలీసులు కూడా ఒకింత వారిని కంట్రోల్ చేయలేక ఇబ్బందులు పడ్డారు. అల్లు అర్జున్ శిల్పా రవికి మద్దతిస్తున్నారని తెలిసి ముందుగా వైసీపీ శ్రేణులు నంద్యాలలో బైక్ ర్యాలీని కూడా నిర్వహించాయి. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు అందాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్న నేపథ్యంలో అనుమతులు లేకుండా అల్లు అర్జున్ పర్యటించడాన్ని ఎన్నికల కమిషన్ తప్పుపట్టింది. దీంతో రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.


Tags:    

Similar News