Ap Elections : చంద్రబాబు అలా కాన్ఫిడెంట్ గా ఉండటానికి కారణం అదేనా? అంటే గెలిచినట్లేగా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి ఎన్నికల్లో తనదే గెలుపు అన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు

Update: 2024-05-31 05:33 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి ఎన్నికల్లో తనదే గెలుపు అన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. వైసీపీకి కేవలం 35 సీట్లు వస్తాయని ఆయన చెబుతున్నారు. ఆయన అన్ని రకాలుగా తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి సిద్ధమవుతున్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఏమేం మొదట చేయాలో? అన్నది కూడా ఆయన ప్రిపేర్ అవుతున్నారట. అంతే కాదు.. ఈసారి తన పాలనలో ప్రత్యేకతను చూపించాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు ఉన్నారట. అమెరికా నుంచి వచ్చిన ఆయన తన సన్నిహితులతో మాట్లాడుతూ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెప్పారట. వన్ సైడ్ విక్టరీ ఈసారి లభించడం ఖాయమని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు.

ఆహ్వానితుల జాబితాను...
అంతే కాదు ఈసారి అధికారంలోకి రావడం ఖాయమని చెబుతూనే తన తొలి ప్రసంగ పాఠాన్ని కూడా రెడీ చేసుకుంటున్నారని సీనియర్ నేతలు చెబుతున్నారంటే ఆయన ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారో అర్థం చేేసుకోవచ్చు. అలాగే ప్రమాణస్వీకారానికి ఎవరెవరిని పిలవాలన్నది కూడా ఆయన ముందుగానే జాబితాను సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు. వీలయితే ప్రధాని నరేంద్ర మోదీ లేకుంటే అమిత్ షాను ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిధులుగా ఆహ్వానించాలని, అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ ను కూడా పిలిచేందుకు ఆయన సిద్ధమయ్యారని చెబుతున్నారు. రిజల్ట్ వచ్చిన వెంటనే రజనీకాంత్ తో పాటు ముఖ్య అతిధుల జాబితాను కూడా సిద్ధం చేయాలని పార్టీ సీనియర్ నేత ఒకరికి బాధ్యత అప్పగించారని తెలిసింది. ఆయన ఈ లిస్ట్ ప్రిపేర్ చేయడంలో మునిగారని తెలిసింది.
ముహూర్తం పనిని...
ఇక మరో అడుగు ముందుకేసి గెలిచిన తర్వాత ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలన్నది కూడా ముందుగానే నిర్ణయించి పెట్టుకోవాలని ఆయన ఆలోచిస్తున్నారు. అందుకు పండితుల సహకారం తీసుకోవాలని మరొక సీనియర్ కు ఈ బాధ్యతను అప్పగించారు. జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం ఉండేలా చూడాలని చెప్పినట్లు తెలిసింది. ప్రమాణ స్వీకారం రాజధాని అమరావతిలోనే ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడానికి, ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరపడానికి కూడా ఒక సీనియర్ నేతకు ఆ బాధ్యతలను అప్పగించినట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
మంత్రి వర్గ విస్తరణ...
ఇక చంద్రబాబు ఈసారి మరొక మెలిక కూడా ముందుగానే పెట్టినట్లు తెలిసింది. జగన్ తరహాలోనే రెండు దఫాలుగా మంత్రివర్గ విస్తరణ చేయాలని నిర్ణయించారు. సీనియర్లతో పాటు జూనియర్లు, సామాజికవర్గాలకు అనుగుణంగా మంత్రివర్గాన్ని రెండు లేదా మూడు సార్లు విస్తరించే యోచలో కూడా ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. ఈసారి సీట్లు త్యాగం చేసినట్లు గానే మంత్రి పదవుల విషయంలో కూడా కొందరు త్యాగం చేయాల్సి ఉంటుందని ముందుగానే కొందరికి చెబుతున్నట్లు సమాచారం. ఇలా చంద్రబాబు తాను ముఖ్యమంత్రి అయిపోయినట్లుగానే భావించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. తొలి సంతకం చేసే ఫైలును కూడా ఆయన ఖరారు చేశారు. అసైన్‌మెంట్ ల్యాండ్ చట్టాన్ని రద్దు చేస్తూ ఆయన తొలిసంతకం చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద చంద్రబాబు మాత్రం కూటమి అధికారంలోకి వచ్చినట్లే ఫీలవుతున్నారు. ఆ దిశగానే ఆయన ఆదేశాలు నేతలకు జారీ చేస్తున్నట్లు తెలిసింది.


Tags:    

Similar News