ఏపీకి వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Update: 2022-11-26 11:58 GMT

ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. నేటి నుంచి రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.

చలిగాలులు కూడా...
రాయలసీమలోని మరికొన్ని ప్రాంతాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో పాటు చలిగాలులు కూడా వీస్తాయని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరింది. అల్పపీడనం ఏర్పడేంత వరకూ ఇలాగే ఉంటుందని తెలిపింది. ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కూడా కురిసే అవకాశముందని పేర్కొంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు మొదలయ్యాయి. మరికొన్ని చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి.


Tags:    

Similar News