పవన్ కు అంబటి మరోసారి సవాల్
పవన్ కల్యాణ్ లా ప్యాకేజీ తీసుకుని పార్టీని తాకట్టుపెట్టే వ్యక్తిని తాను కాదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు
పవన్ కల్యాణ్ లా ప్యాకేజీ తీసుకుని పార్టీని తాకట్టుపెట్టే వ్యక్తిని తాను కాదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పవన్ చంద్రబాబు పాదాల వద్ద పార్టీని తాకట్టు పెట్టారన్నారు. శవాల మీద పేలాలు ఏరుకునే దౌర్భాగ్య స్థితిలో తాను లేనన్న అంబటి రైతుల ఆత్మహత్యలకు వచ్చిన పరిహారాన్ని తీసుకోవాల్సిన ఖర్మ తనకు లేదని చెప్పారు. తనపై ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ‌్ కు తాను సవాల్ విసిరితే నిరూపించలేక పారిపోయాడని ఎద్దేవా చేశారు.
అవినీతి లేకుండా....
సత్తెనపల్లిలో మొత్తం 12 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి ఒక్కొక్క కుటుంబానికి ఏడు లక్షల రూపాయల చొప్పున 84 లక్షల రూపాయలనుద ప్రభుత్వం పరిహారంగా చెల్లించిందని చెప్పారు. ఇందులో ఒక్కరూపాయి కూడా అవినీతి జరగలేదని అంబటి చెప్పారు. ఒక ప్రయివేటు వ్యక్తికి సంబంధించిన సెప్టిక్ ట్యాంకు లో క్లీనింగ్ చేస్తూ మరణించిన ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన పంచాయతీని దీనికి ముడిపెట్టి ఆరోపణలు చేస్తున్నారని అంబటి ఫైర్ అయ్యారు. తాను రైతు కుటుంబాల నుంచి రెండు లక్షల లంచం తీసుకుంటున్నట్లు నిరూపిస్తే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని మరోమారు సవాల్ విసిరారు.