Heavy Rains : ఆంధ్రప్రదేశ్ కు తుపాను గండం.. నాలుగు రోజులు భారీ వర్షాలు ఖాయం

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది

Update: 2024-11-25 04:23 GMT

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తర్వాత తుపాను గా మరే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలో నాలుగురోజుల పాటు అతి భారీ వర్షాల నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అందుకే ప్రజలు ముందుగానే అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీ ప్రజలకు సూచనలు చేసింది.

భారీ వర్షాలు కురుస్తాయని...
మరోవైపు వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ఏపీలో గాని తమిళనాడులో తీరం దాటే అవకాశముందని కూడా తెలిపింది. వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ 27వ తేదీ సాయంత్రానికి తమిళనాడు శ్రీలంక సమీపంలో తీరం దాటే అవకాశముందని కూడా మరో అంచనా వినపడుతుంది. ఈరోజు నుంచి ఏపీలో కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే ఈ నెల 27వ తేదీ నుంచి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. రాయలసీమ జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
మత్స్యాకారులకు చేపలవేట...
ప్రధానంగా ఈ వాయుగుండం ప్రభావంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. తీరం వెంట గంటకు 35 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 29 వరకూ చేపల వేట నిషిద్దమని తెలిపింది. సముద్రంలో అలజడి ఎక్కవగా ఉండే అవకాశముండటంతో చేపలవేటను నిషేధించారు. రైతులు తమ పంట ఉత్పత్తులను ముందుగానే జాగ్రత్త చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.



Tags:    

Similar News