Tiruamala : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సులువుగానే దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ నేడు తక్కువగానే కనిపిస్తుంది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు;

Update: 2024-11-25 03:52 GMT

తిరుమలలో భక్తుల రద్దీ నేడు తక్కువగానే కనిపిస్తుంది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. ఆఖరి కార్తీక సోమవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా కనిపించడం లేదు. వీధులన్నీ ఖాళీగానే ఉన్నాయి. మాడ వీధులన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి. భక్తుల రద్దీ అంతగా లేకపోవడంతో స్వామి వారి దర్శనం సులువుగానే భక్తులకు లభిస్తుంది. నిన్నటి వరకూ తిరుమలకు పోటెత్తిన భక్తులు ఒక్కసారిగా తగ్గిపోయారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం తయారీలను తగ్గించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆఖరి కార్తీక సోమవారం కావడంతో ఎక్కువగా భక్తులు శైవ క్షేత్రాలకు వెళ్లి ప్రార్థనలు చేస్తుంటారు. అందుకే తిరుమలలో భక్తుల దర్దీ క్కువగా ఉంది. దీంతో పాటు ముందుగా బుక్ చేసుకున్న వారు మాత్రం తిరుమల వచ్చిస్వామి వారికి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. తలనీలాలను సమర్పించే ప్రాంతాలు కూడా పెద్దగా రద్దీ లేకపోవడంతో భక్తులు త్వరగానే తలనీలాలను సమర్పించుకుని వెళుతున్నారు.

రెండు కంపార్ట్ మెంట్లలోనే...
తిరుమల శ్రీవారి దర్శన, గదుల టికెట్లను నేడు విడుదల కానున్నాయి. ఫిబ్రవరి నెలకు సంబంధించిన మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను ఉదయం పది గంటలకు ఆన్ లైన్ లో ఉంచుతారు. అలాగే ఫిబ్రవరి కోటా గదుల టికెట్లను ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేయనున్నారు. ఆర్జిత సేవలు, దర్శనం, వసతి కోటా టికెట్లను https://ttdevasthanams.ap.gov.in సైట్ నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని టీటీడీ సూచించింది. నేడు తిరుమలలోని రెండు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులు మాత్రం శ్రీవారిని ఎనిమిది గంటల్లో దర్శనం చేసుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనానికి భక్తులకు రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 75,737 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.14 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.



Tags:    

Similar News