పళ్లేల మోతపై అంబటి ట్వీట్

టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా ప్లేట్లు మోగిస్తూ మద్దతు తెలపాలని టీడీపీ చేసిన నిర్ణయంపై అంబటి రాంబాబు సెటైర్ వేశారు

Update: 2023-09-29 14:08 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా రేపు ప్లేట్లు మోగిస్తూ మద్దతు తెలపాలని టీడీపీ నిర్ణయించింది. దీనిపై నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ఆయన పళ్లేలు మోగించడంపై సెటైరికల్ గా ట్వీట్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చంద్రబాబు నాయుడుకు మద్దతుగా కంచాలు మోగించమని కోరడాన్ని ఎద్దేవా చేశారు.

విధి విచిత్రం...
మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ లో "విధి విచిత్రమైనది. కాపు ఉద్యమంలో పళ్లేలు కొట్టిన వారిని మక్కెలరగ గొట్టి బొక్కలో వేసావ్. అవినీతి కేసులో బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్... వారే వాహ్" అంటూ ఆయన ట్వీట్ చేశారు. గతంలో ముద్రగడ కాపులకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ పళ్లేలు మోగించమని ఇచ్చిన పిలుపును ఇప్పుడు అంబటి గుర్తు చేస్తూ ఈ ట్వీట్ చేశారు.


Tags:    

Similar News