Chandrababu : నేడు చంద్రబాబు సీఆర్డీఏపై సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. చంద్రబాబు నాయుడు ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీకి రానున్నారు. 10.30 నుంచి 02.30 వరకు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 02.30 నుంచి 03.30 వరకు సీఆర్డీయేపై చంద్రబాబు సమీక్షను నిర్వహిస్తారు.
ప్రధాని భేటీకి ముందు...
రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో దీనికి సంబంధించిన శంకుస్థాపనలకు సంబంధించిన అంశాలపై చంద్రబాబు సీఆర్డీఏ అధికారులతో చర్చిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకి ముందు సీఆర్డీఏ అధికారులతో సమావేశమై పరిస్థితిని అడిగి తెలుసుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకూ వరకు మైనింగ్ విభాగంపై సమీక్ష చేస్తారు.సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు బయలుదేరుతారు