మేదరమెట్లకు చేరుకున్న జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితం బాపట్ల జిల్లాలోని మేదరమెట్లకు చేరుకున్నారు;

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితం బాపట్ల జిల్లాలోని మేదరమెట్లకు చేరుకున్నారు. వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ మరణించడంతో ఆమె భౌతిక కాయానికి జగన్ నివాళులర్పించారు. వైవీ సుబ్బారెడ్డికి తన సానుభూతిని ప్రకటించారు. హెలికాప్టర్ లో మేదరమెట్ల చేరుకున్న జగన్ కు వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి స్వాగతం పలికారు.
వైవీ కుటుంబానికి...
వైవీ సుబ్బారెడ్డి తల్లి మరణించడంతో ఆయన నేరుగా మేదరమెట్లకు వచ్చి వైవీ కుటుంబానికి తన సానుభూతిని తెలిపారు. వైఎస్ జగన్ వచ్చిన సందర్భంలో వైఎస్ విజయమ్మ కూడా అక్కడే ఉన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి రావడంతో జగన్ వైవీ కుటుంబాన్ని పరామర్శించే సమయంలో కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది.