Tirumala : తిరుమలలో భక్తుల రద్దీతో అలెర్ట్ అయిన టీటీడీ

తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. మంగళవారమయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు;

Update: 2025-03-18 04:00 GMT
darsan time today in tirumala,  rush, devotees, tuesday
  • whatsapp icon

తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. మంగళవారమయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. సహజంగా సోమవారం నుంచి గురువారం వరకూ తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. అయితే నిన్నటి నుంచి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రధానంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుగుతుండటంతో ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

నేడు టీటీడీ ఆన్ లైన్ లో టిక్కెట్లు....
నేడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేయనున్నారు. జూన్ నెల కోటా టీటీడీ విడుదల చేయనున్నారు. ఈనెల 22న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్ల విడుదల చేయనున్నారు. ఈనెల 24న ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక దర్శన కోటాను విడుదల చేస్తున్నట్లు టీటీడీ అధికారుల ప్రకటించారు. భక్తులు ఆరోజు బుక్ చేసుకుని జూన్ నెలలో స్వామి వారిని సులువుగా దర్శించుకోవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 25 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 70,824 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,674 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.84 కోట్ల రూపాయలు వచ్చింది.


Tags:    

Similar News