Andhra Pradesh : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాజధాని పనులను
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 15వ తేదీ తర్వాత అమరావతి పనులను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది;

వచ్చే నెల 15వ తేదీ తర్వాత అమరావతి పనులను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి రీ లాంచ్ కోసం పనులను ప్రారంభించేందుకు సిద్ధమవ్వాలని సీఆర్డీఏ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సచివాలయం వెనక భాగంలో ఉన్న ప్రాంతంలో పనులు ప్రారంభించాలని, అక్కడే బహిరంగసభను ఏర్పాటు చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లను కూడా పరిశీలించాలని చంద్రబాబు కోరారు.
వచ్చేనెలరెండో వారంలో...
వచ్చేనెలరెండో వారంలో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి రానున్నారని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వచ్చే నెల రెండో వారం నుంచి పనులను ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని కూడా చంద్రబాబు ఆదేశించారు. ప్రధాని అపాయింట్ మెంట్ ను బట్టి తేదీ ఖరారవుతుందని, అంతకు ముందే సభ వేదిక, పనులకు సంబంధించిన శంకుస్థాపనల విషయం చూడాలని చంద్రబాబు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు.