Hot Waves : వామ్మో.. ఇంకా మూడు నెలలు భరించేదెలా?

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండి పోతున్నాయి. అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండటంతో ప్రజలు భయపడిపోతున్నారు;

Update: 2025-03-18 04:27 GMT
hear waves, summer, 40 degrees, emperatures
  • whatsapp icon

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండి పోతున్నాయి. అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండటంతో ప్రజలు భయపడిపోతున్నారు. ప్రజలు బయటకు వచ్చేందుకు కూడా జంకుతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి వేడి తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అనేక జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అవసరమైతే తప్ప ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఇంట్లోనే ఉండటం మంచిదని సూచిస్తున్నారు.

గతంలో ఎన్నడూ...
గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మార్చి నెలలోనే నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పాటు వేసవి తీవ్రత రోజురోజుకూ ఎక్కువగా ఉండటంతో ప్రజలను వాతావరణ శాఖ అలెర్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, విజయవాడ, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అలాగే తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
వడగాలుల తీవ్రత...
ఆంధ్రప్రదేశ్ లో వడగాలుల తీవ్రత కూడా ఎక్కువయింది. ఆంధ్రప్రదేశ్ లోని 35 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరో 167 మండలాల్లో మోస్తరు వడగాలులు వీస్తాయని తెలిపింది. గత ఏడాది మార్చితో పోలిస్తే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. కర్నూలులో 40.6 డిగ్రీలు, నందిగామలో 40 డిగ్రీలు, అనంతపురంలో 39.2, ఎన్టీఆర్‌ జిల్లాలో 38.21 డిగ్రీలు నమోదయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.


Tags:    

Similar News