వైసీపీ సోషల్ మీడియా వింగ్ పై జగన్ ఫోకస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ సోషల్ మీడియాపై ఫోకస్ పెంచారు.

Update: 2022-09-13 08:01 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ సోషల్ మీడియాపై ఫోకస్ పెంచారు. సోషల్ మీడియా వింగ్ పర్యవేక్షణ బాధ్యతలను సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవ్ రెడ్డికి అప్పగించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ తో జరిగిన సమావేవంలో భార్గవ్ తో పాటు వైసీపీ సోషల్ మీడియా విభాగానికి చెందిన వారు కూడా పాల్గొన్నారని తెలిసింది. వైసీపీ సోషల్ మీడియా విభాగ పర్యవేక్షణ బాధ్యతను రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చూస్తున్నారు.

సజ్జల భార్గవ్ రెడ్డిని....
అయితే పని వత్తిడి కారణంగా ఆయన సక్రమంగా దృష్టి సారించలేకపోతున్నారని భావించిన జగన్ సజ్జల భార్గవ్ రెడ్డిని రంగంలోకి దించినట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వంపైనా, జగన్ కుటుంబంపైనా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులకు సక్రమంగా వైసీపీ వింగ్ స్పందించడం లేదని జగన్ భావిస్తున్నారు. అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


Tags:    

Similar News