ఫలించిన హోంగార్డు ల అభర్థన..AP ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు..!!
నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కొలువు తీరిన NDA కూటమి ప్రభుత్వం...
నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కొలువు తీరిన NDA కూటమి ప్రభుత్వం... అధికారం చేపట్టిన కొద్ది కాలంలోనే నిరుద్యోగులకు వరంలా.... కానిస్టేబుల్ నియామకానికి సంబంధించి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు..ఈ మేరకు ప్రకటన జారీ చేశారు...!!
ఇందుకు సంబంధించి త్వరలోనే దేహ దారుడ్య పరీక్షలు కూడా త్వరగా నిర్వహించాలని యోచిస్తోంది..!!!
అయితే దీనికి సంబంధించి... పోలిస్ విభాగంలో... తమను ప్రత్యేక కేటగిరీ గా పరిగణించాలి అని కోరుతూ.... హోంగార్డు అభ్యర్థులు అందరూ హైకోర్టును ఆశ్రయించారు....!!!
దీనికి సంబంధించి.. న్యాయమూర్తి జస్టిస్ ఎన్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలోని ధర్మాసనం.. హోంగార్డు అభ్యర్థులు అందరినీ దేహ దారుడ్య పరీక్షలకు అనుమతించాలని , పోలీసు నియామక బోర్డును ఆదేశిస్తూ... ఉత్తర్వులు జారీ చేసింది...!!!
పోలీసు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో తమను జనరల్ కేటగిరీ అభ్యర్థులుగా పేర్కొనడంతో అర్హత మార్కులు సాధించలేక పోయామని పేర్కొంటూ పలువురు హోంగార్డు అభ్యర్ధులు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు...!!
వీటిని ఇటీవల కోర్టు ఎదుట విచారణకు ఉంచగా..... ఇదే సమస్యపై మరో వందమందికి పైగా హోంగార్డులు కూడా హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలుచేశారు. పోస్టుకు ఎంపిక అయ్యేందుకు సాధారణ అభ్యర్థులకు నిర్ణయించిన మార్కులనే తమకు వర్తింపజేయడం తగదని తమ పిటిషన్లలో పేర్కొన్నారు. తమకు ప్రత్యేక మెరిట్‌లిస్ట్ తయారు చేసేలా పోలీసు నియామక బోర్డును ఆదేశించాలని వారంతా కోరారు. దీంతో వీటన్నింటినీ పరిశీలించిన కోర్టు పోటీపడుతున్న హోంగార్డులను దేహదారుఢ్య పరీక్షకు అనుమతించాలని పోలీసు నియామక బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.