ఆధార్ కార్డులో...... ఆ మార్పు ఇక సులభతరం...!!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధార్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది..;

Update: 2024-11-17 12:59 GMT
Aadhar update, Aadhar card number, Andhra pradesh
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధార్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది..... నిజానికి ఇది ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పవచ్చు కొన్ని సమస్యలనుండి...

ప్రస్తుతం మన ఉన్న పరిస్థితుల్లో...ఏం పనికైనా ఆధార్ అవసరం తప్పనిసరి అయింది...వంట గ్యాస్, బ్యాంకు ఖాతా,పంట బీమా,వాహన రిజిస్ట్రేషన్, లైసెన్స్, రేషన్,ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేమిటి చాలా ఉన్నాయి...

ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే...కొన్నింటిలో మన పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు....

ఇప్పటివరకు... ఆధార్ లో జనన తేదీ మార్పుకు విద్యా ధృవీకరణ పత్రాలను పరిగణలోకి తీసుకొనేవారు. కానీ కొంత వయస్సు అధికంగా ఉన్న వారికి మాత్రం కొంత ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. కారణం వారి వద్ద విద్యా ధృవీకరణ పత్రాలు లేకపోవడం ఒక కారణం కాగా, అలాగే ఆ పత్రాలలో వివరాలు సక్రమంగా కనిపించకపోవడం కూడా ఒక సమస్య.

అయితే వయస్సు ధృవీకరణ నిర్ధారించేందుకు ఆధార్ తప్పనిసరిగా మారిన వేళ, ఆధార్ లో తప్పుగా నమోదైన జనన వివరాలను మార్చుకొనేందుకు ప్రజలు పడే ఇబ్బందులు అన్నీ, ఇన్నీ కావు. ప్రధానంగా ప్రభుత్వం మంజూరు చేసే వృధ్యాప్య పింఛన్ కు ఆధార్ ప్రామాణికంగా మారింది. అయితే గతంలో ఆధార్ లో తప్పులు దొర్లితే, సులభతరంగా మార్చేవారు. అయితే ఈ క్రమంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించి, ఆధార్ లో మార్పుల కొరకు కఠినతర నియమ నిబంధనలు అమలులోకి వచ్చాయి.

ఇలాంటి వారి కోసమే ఏపీ ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది.


అదేమిటంటే.. ఆధార్ కార్డులో పుట్టినరోజు తేదీ మార్పు కొరకు ఇప్పటి నుండి ప్రభుత్వ వైద్యులు నిర్ధారించిన వయస్సు ధృవీకరణ పత్రాలను కూడా, పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. అయితే ప్రభుత్వ వైద్యులు అందించే ఈ పత్రాలు క్యూఆర్ కోడ్ ని కలిగి ఉండాలని, ఈ విషయాన్ని ఆయా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది గమనించాలని సూచించింది. ఇప్పటి వరకు ఆధార్ కార్డులో జనన తేదీని మార్చుకోలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇదొక బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు...!!!

Tags:    

Similar News