సెల్ ఫోన్ మోజులో..సాంబార్ లో పడి... బాలుడు మృతి..!!!

ఈ మధ్య కాలంలో.. పిల్లల నుంచి తప్పించుకొని పనిలో నిమగ్నమవడానికి....అందరూ చేసే పని..

Update: 2024-11-17 11:27 GMT

ఈ మధ్య కాలంలో.. పిల్లల నుంచి తప్పించుకొని పనిలో నిమగ్నమవడానికి....అందరూ చేసే పని..ఆ పసి పిల్లలకు సెల్ ఫోన్ ఆశను చూపించడం.... తద్వారా పెద్ద రిలీఫ్..మనపని మనం హాయిగా చేసుకోవచ్చు...

ఇలాంటి పనే....ఓ ఇంట్లో కొంప ముంచింది...

కేవలం మొబైల్ గేమ్ ఆ బాలుడిని బలి తీసుకుంది... ఇటువంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి...మనం మాత్రం మారటం లేదు...!!

చనిపోయిన బాలుడి వివరాలు ఇలా ఉన్నాయి.. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం వేమూగోడు.

మేనమామ పెళ్లి కోసం అమ్మనాన్నలతో కలిసి..గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం... పైపాడు గ్రామానికి కుటుంబంతో కలిసి వెళ్లాడు బాలుడు జగదీష్.

పెళ్లి కోసం సిద్ధం చేసిన వంటలన్ని ఓ రూమ్‌లో ఉంచారు..

సెల్‌ఫోన్ ఆటలో మునిగిన బాలుడు చూడకుండా వెళ్లి సాంబార్ గిన్నెపై కూర్చున్నాడు.. మూత పక్కకు జరగడంతో అందులో పడిపోయాడు...!!

పిల్లాడు కేకలు వేయడంతో బయటకు తీసిన బంధువులు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పిల్లాడిని బ్రతికించేందుకు వైద్యుల చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు బాలుడు.

ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న బాలుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు...!!!

Tags:    

Similar News