నేడు జగనన్న విద్యాదీవెన ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు జగనన్న విదేశీ విద్యాదీవెన పథకాన్ని ప్రారంభించనున్నారు

Update: 2023-02-03 02:47 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు జగనన్న విదేశీ విద్యాదీవెన పథకాన్ని ప్రారంభించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు ఆర్థిక సాయాన్ని అంద చేయనున్నారు. ఈ ఏడాది టాప్ 200 విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లను పొందిన 213 మందికి తొలి విడత సాయంగా 19.95 కోట్ల రూాపాయలను విడుదల చేయనున్నారు.

బటన్ నొక్కి...
తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి నిధులను జగన్ విడుదల చేయనున్నారు. గరిష్టంగా 1.25 కోట్ల రూపాయలు, మిగిలిన వారికి కోటి రూపాయల వరకూ ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకం కిద నిధులను విడుదల చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు వందశాతం, మిగిలిన విద్యార్థులకు యాభై లక్షలు లేదా ట్యూషన్ ఫీజులో యాభై శాతం ఏది తక్కువైతే అది చెల్లించనున్నారు.


Tags:    

Similar News