CBI : సీబీఐ ఎంట్రీకి అనుమతి అందుకేనా? జగన్ చుట్టూ ఉచ్చు బిగించటానికేనా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ విచారణకు నేరుగా ఏపీలో అనుమతిస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది

Update: 2024-08-21 04:01 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ విచారణకు నేరుగా ఏపీలో అనుమతిస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గెజిట్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగులు, ప్రయివేటు సంస్థలు వంటి వాటిపై ఏదైనా ఫిర్యాదు వస్తే సీబీఐ నేరుగా విచారణ చేపట్టేందుకు అవకాశమిచ్చింది. అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సీబీఐ విచారణ చేపట్టాలంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అంటూ షరతు మాత్రం విధించింది. 2014 - 2019 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణకు నిరాకరిస్తూ నాటి చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కొన్ని కీలక కేసులను
అయితే తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీబీఐ విచారణకు అనుమతించినప్పటికీ తాజాగా మరోసారి గెజిట్ విడుదల చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. జగన్ తో పాటు వైసీపీ నేతల కోసమే ఈ గెజిట్ ను విడుదల చేసినట్లు గుసగుసలు వినిపస్తున్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొన్ని కీలక కేసులను సీఐడీకి అప్పగించింది. మద్యం కేసుతో పాటు ఇసుక దోపిడీ, ఆడుదాం ఆంధ్ర, ఫైబర్ నెట్ కేసులను ఏపీ సీఐడీ విచారిస్తుంది. అయితే సీఐడీ విచారణ చేపట్టే ఈ కేసుల కన్నా ముఖ్యమైన కేసులను సీబీఐకి అప్పగించాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు ఉన్నారని చెబుతున్నారు.
రాజకీయంగా ఇబ్బందులను...
సీబీఐ విచారణతో జగన్ రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కొనడమే కాకుండా న్యాయస్థానాలకు హాజరయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. జగన్ ప్రభుత్వం చేసిన తప్పుులను లెక్క గడుతున్న కూటమి ప్రభుత్వం సీబీఐ అయితే జగన్ కు కరెక్ట్ అని భావించి తిరిగి సీబీఐ ఏపీలో విచారణకు అనుమతిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అక్రమ బియ్యం సరఫరాపై ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో పాటు వివిధ కేసుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మరికొందరు సీనియర్ నేతలను కూడా ఇరికించే ప్రయత్నం జరుగుతుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు స్కెచ్ జగన్ పార్టీపై అదిరిపోయిందిగా?


Tags:    

Similar News