ఏపీ కోలుకోలేదు....మరో మూడు రోజులు ముప్పు తప్పదు
ఆంధ్రప్రదేశ్ ను భారీ వర్షాలు వీడటం లేదు. మరో మూడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ ను భారీ వర్షాలు వీడటం లేదు. మరో మూడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం ప్రభావంతో ఏపీలోని కడప, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం దాటింది.
తీవ్రస్థాయిలో నష్టం....
ఇప్పటికే గత నాలుగైదు రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగాయి. జనజీవనం స్థంభించిపోయింది. ప్రాణ, ఆస్తినష్టం భారీ స్థాయిలో జరిగింది. నీటికి నానుతూ భవనాలు కూలిపోతున్నాయి. భారీగా పంట నష్టం జరిగింది. వివిధ ప్రాజెక్టుల నుంచి నీటిని కిందకు వదులుతున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలకు తరలించారు. ముఖ్యమంత్రి జగన్ వరదల కారణంగా చనిపోయిన వారికి ఒక్కొక్కరికి ఐదు లక్షల పరిహారాన్ని ప్రకటించారు. నేడు జగన్ వరద ప్రాంతాలపై సమీక్ష చేయనున్నారు.