ఏపీకి మరో అలెర్ట్... కుండపోత వర్షాలతో...?
ఏపీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత వారం రోజుల నుంచి కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత వారం రోజుల నుంచి కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సాధారణ జన జీవనం స్థంభించి పోయింది. వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. నేటి నుంచి మూడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
ఈరోజు తీరం....
చెన్నైకి ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం ఉ:ది. ఈరోజు అది తీరం దాటే అవకాశాలున్నాయి. తమిళనాడు, దక్షిణ కోస్తాల మధ్య గాని, చెన్నై, పుదుచ్చేరి మధ్య గాని వాయుగుండం తీరం దాటే అవకాశముంది. దీంతో చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.