ఏపీకి మరో రెండు రోజులు భారీ వర్షాలే

ఆంధ్రప్రదేశ్ కు మరో రెండురోజులు భారీ వర్షాల ముప్పు ఉంది

Update: 2021-11-28 02:09 GMT

ఆంధ్రప్రదేశ్ కు మరో రెండురోజులు భారీ వర్షాల ముప్పు ఉంది. కొమరిన్, శ్రీలంక తీర ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ నెల 29వ తేదీ వరకూ భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పింది.

మరో అల్పపీడనం...
దక్షిణ అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడిందని కూడా వాతావరణ శాఖ వెల్లడించాింది. దీంతో నేడు, రేపు ఏపీలో ఒక మోస్తరు జల్లులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.


Tags:    

Similar News