ఏపీలో ఆధార్ కార్డు కావాలనుకునే వారికి గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్ కార్డు నమోదుకు అవకాశం ఇచ్చింది;

pan - aadhar link solution
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్ కార్డు నమోదుకు అవకాశం ఇచ్చింది. రాష్ట్రంలో చిన్నారులకు ప్రత్యేకంగా ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. మార్చి 19వ తేదీ నుంచి మార్చి 22వ తేదీ వరకు, తిరిగి మార్చి 25వ తేదీ నుంచి మార్చి 28వ తేదీ వరకు రెండు విడతల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు.
తాజా ఆదేశాలతో...
ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్యాంపుల్లో చిన్నారులకు ఆధార్ నమోదుతో పాటు అప్ డేట్ కూడా చేయించుకోవచ్చు. చిన్నారుల కోసమే ప్రత్యేకంగా ఈ క్యాంప్ లను నిర్వహిస్తున్నామని,ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని అధికారులు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.