ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఇక్కడ పనిచేసినోళ్లకు అదనపు వేతనం
అమరావతి పనులు పర్యవేక్షించే సీఆర్డీఏలో పనిచేసేందుకు వచ్చే అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది;

Andhra pradesh
రాజధాని అమరావతి పనులు పర్యవేక్షించే సీఆర్డీఏలో పనిచేసేందుకు వచ్చే అధికారులు, ప్రభుత్వ సిబ్బందికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అమరావతి పనులు తిరిగిప్రారంభం కానున్న నేపథ్యంలో రాజధాని ప్రాంత అభి వృద్ధి ప్రాధికార సంస్థ పూర్తిస్థాయిలో సన్నద్ధ మవుతోంది. పెద్దఎత్తున నిర్మాణ పనులు, కార్యకలా పాలు ప్రారంభం కానున్న దృష్ట్యా అవసరమైన మేర మానవ వనరులు సమకూర్చుకుంటోంది. ఇందులో భాగంగా వివిధ ప్రభుత్వ సంస్థలు, శాఖల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించేందుకు వేతనంతో పాటు ప్రత్యేక భత్యం ప్రోత్సాహకంగా ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.
డిప్యూటేషన్, ఓడీలపై...
డిప్యుటేషన్, ఓడీపై సీఆర్డీఏకు వచ్చే వారికి మూల వేతనంపై 30 శాతం భత్యంగా ఇవ్వనున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏడాది పాటు దీనిని అమలు చేయనున్నారు. ఈలోగా దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ ప్రాతిపదికన సిబ్బందిని నియమించనున్నారని అధికారవర్గాలు వెల్లడించాయి.