జగన్ కు ఆ సర్పంచ్ ఏం చెప్పారంటే?

నంద్యాల వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నంద్యాల జిల్లా సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి కలిశారు.

Update: 2022-09-29 03:26 GMT

ఆంధ్రప్రదేశ్ లో సర్పంచ్ లు నిధులు లేక గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి చేపట్టలేకపోతున్నారు. 14,15 ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడంతో వీధిలైట్లను కూడా వారు మర్మమతులు చేయించలేకపోతున్నారు. దీంతో నిన్న నంద్యాల వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నంద్యాల జిల్లా సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి కలిశారు. ఆయన ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని సమర్పించారు.

90 శాతం పంచాయతీల్లో...
ఆంధ్రప్రదేశ్ లో 90 శాతం పంచాయతీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే సర్పంచ్ లుగా గెలిచారని, కాని నిధులు లేకపోవడంతో గ్రామాల్లో మోటార్లు, పైపులైన్ల మరమ్మతులు చేయలేకపోతున్నామని ఆయన సీఎం జగన్ దృష్టికి తీసుకు వచ్చారు. ఆర్థికంగా సర్పంచ్ లు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే పంచాయతీ నిధులకు విడుదల చేయించేలా చర్యలు తీసుకోవాలని ఆయన నంద్యాలలో ముఖ్యమంత్రి జగన్ కోరారు.


Tags:    

Similar News