మళ్లీ ఢిల్లీకి ఏపీ సీఎం.. ఎందుకంటే?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి

Update: 2024-07-25 14:13 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పయనమవ్వనున్నారు. జులై 26 రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. జులై 27న ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. పోలవరం కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి నీతి ఆయోగ్ ముందు ప్రతిపాదనలు ఉంచనున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించకుండా గతంలో నిర్దేశించిన మేరకే కట్టుబడి ఉండాలని ఏపీ క్యాబినెట్ సమావేశంలో తీర్మానించారు. ఈ అంశాన్ని కూడా ఆయన కేంద్రానికి వివరించనున్నారు. నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన అనంతరం విజయవాడకు తిరిగి రానున్నారు.

ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవ్వడం లేదు. జూలై 27న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని తమ ప్రభుత్వం బహిష్కరిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2024 కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘‘కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగా జూలై 27న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం బహిష్కరిస్తోంది. తెలంగాణ హక్కులను కేంద్రం కాలరాసింది. నిధుల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది’’ అని తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అన్నారు.


Tags:    

Similar News