మంత్రి పేర్నినానికి అదనపు బాధ్యతలు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పేర్నినానికి సినిమాటోగ్రఫీ శాఖ బాధ్యతలు అప్పగించారు

Update: 2021-12-15 12:20 GMT

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పేర్నినానికి సినిమాటోగ్రఫీ శాఖ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. మంత్రి పేర్నినాని ప్రస్తుతం రవాణా, సమాచార శాఖ బాధ్యతలు చూసుకుంటుండగా.. ఇప్పటి నుంచి సినిమాటోగ్రఫీ బాధ్యతలు కూడా ఆయన కిందికే చేర్చారు. కాగా.. ప్రస్తుతం ఏపీలో సినిమాటికెట్ల ధరల విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. టికెట్ల ధరలు పెంచడం కుదరదని ఇటీవల ఏపీ ప్రభుత్వం జీవో 35ను ప్రవేశపెట్టింది. పెద్ద, చిన్నా అని తేడా లేకుండా అన్ని సినిమాలకు ఒకే టికెట్‌ ధరలు వర్తిస్తాయని జీవోలో పేర్కొంది.

రేపటికి వాయిదా
అయితే ఏపీ ప్రభుత్వ జీవోను సవాల్‌ చేస్తూ డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. జీవో 35ను సస్పెండ్ చేస్తూ.. సినిమా టికెట్ల ధరలను పెంచడం, తగ్గించడం వంటి నిర్ణయం పూర్తిగా థియేటర్ల యాజమాన్యానికే ఉంటుందని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. డివిజన్‌ బెంచ్‌లో విచారణ చేపట్టిన హైకోర్టు టికెట్ల ధరల నిర్ణయం విషయంలో విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ శాఖను మంత్రి పేర్నినానికి అప్పగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


Tags:    

Similar News