కొనసాగుతున్న వాదనలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.

Update: 2023-09-19 11:19 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. సీఐడీ తరుపున న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలను వినిపించారు. చంద్రబాబు నాయుడుకు 17 ఏ వర్తించని ఆయన తెలిపారు. అది పబ్లిక్ సర్వెంట్లకు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. ఆరు షెల్ కంపెనీలకు డబ్బులు తరలించినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని ముకుల్ రోహత్గి ఉన్నారు. వర్చువల్ గా రోహత్గి వాదించారు. మూడు వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయో తేల్చాల్సి ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంఓయూలు ఎలా కుదుర్చుకున్నారని ప్రశ్నించారు.

కేబినెట్ ఆమోదం లేకుండానే...
ఈ డీల్ కు కేబినెట్ ఆమోదం లేదన్న మోదీ చంద్రబాబు పథకంప్రకారమే తన అనుచరులతో కలసి 317 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని తెలిపారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాతనే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని తెలిపారు. రెండేళ్ల పాటు సమగ్రంగా విచారణ జరిపిన తర్వాతనే అరెస్ట్ చేశారన్నారు ముకుల్ రోహత్గి, ఆధారాలు ఉన్నాయి కాబట్టే చర్యలు తీసుకున్నారని, సబ్ కాంట్రాక్టర్ల వెనక ఎవరు ఉన్నారన్నది బయటకు రావాల్సి ఉందని కూడా ఆయన వాదించారు.


Tags:    

Similar News