ఏపీ సీఎంకు సింపుల్ గా బర్త్ డే విషెస్ చెప్పిన చంద్రబాబు

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా జగన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. అదికూడా చాలా సింపుల్ గా..

Update: 2021-12-21 11:31 GMT

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలంతా జగన్ కు వివిధ రకాలుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు, అన్నదానాలు నిర్వహించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా జగన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. అదికూడా చాలా సింపుల్ గా.. ఒకే ఒక్క మాట అంతే. "హ్యాపీ బర్త్ డే జగన్" అంటూ ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అంతకుమించి ఒక్క మాట కూడా రాయలేదు. ఆ ట్వీట్ కు నెటిజన్లు పలురకాలుగా రెస్పాన్డ్ అవుతున్నారు. నిమిషాల వ్యవధిలోనే లైక్స్, షేర్స్, కామెంట్లు వస్తున్నాయి.

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అగ్రహీరోలు
అలాగే.. టాలీవుడ్ అగ్రహీరోలు కూడా జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో విషెస్ తెలిపారు. 'హ్యాపీ బర్త్ డే జగన్మోహన్ రెడ్డిగారు. భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలి' అని ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సోషల్ మీడియా ద్వారానే బర్త్ డే విషెస్ అందించారు. 'గౌరవనీయ ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో ఏపీ పురోగమించాలి, పరిఢవిల్లాలి. అన్నివేళలా సంతోషం, ఆరోగ్యం మీకు ఉండాలని ఆకాంక్షిస్తున్నా' అని ట్వీట్ చేశారు. 'ఏపీ సీఎం జగన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు' అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానని పేర్కొన్నారు.






Tags:    

Similar News