Chandrababu : చంద్రబాబు ఆకస్మిక పర్యటన ఇక్కడి నుంచే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకస్మిక పర్యటనలకు నేటి నుంచి శ్రీకారం చుట్టనున్నారు.;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకస్మిక పర్యటనలకు నేటి నుంచి శ్రీకారం చుట్టనున్నారు. 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించినప్పుడు చంద్రబాబు ఆకస్మిక పర్యటనలు చేసి అధికారులకు దిశానిర్దేశం చేసేవారు. వివిధ అంశాలపై ఆయన సమీక్షలు జరిపే వారు. దాదాపు సుదీర్ఘ కాలం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి ఆకస్మిక పర్యటనలకు శ్రీకారం చుట్టారు.
ఇది మంచి ప్రభుత్వం....
ఈసారి తాను ఆకస్మిక పర్యటనలకు వస్తానని ఇటీవలే ప్రకటించిన చంద్రబాబు నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. తొలుత శ్రీకాకుళం జిల్లాలో పర్యటించాలనుకున్నప్పుటికీ అక్కడ భారీ వర్షాలు కురుస్తుండటంతో అక్కడ పర్యటన రద్దయింది.