Chandrababu : సాధారణ కార్యకర్తలకు టిక్కెట్ ఇచ్చాం గెలిపించుకునే బాధ్యత మీదే

సాధారణ కార్యకర్తకు ఎమ్మెల్యే సీటు ఇచ్చిన ఘనత టీడీపీది అని చంద్రబాబు అన్నారు. ఆలూరులో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు

Update: 2024-04-19 13:09 GMT

సాధారణ కార్యకర్తకు ఎమ్మెల్యే సీటు ఇచ్చిన ఘనత టీడీపీది అని చంద్రబాబు అన్నారు. ఆలూరులో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. కురుబ సామాజికవర్గానికి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీకి దింపామని తెలిపారు. వాళ్లకిచ్చే గౌరవం ప్రజా గౌరవమని చంద్రబాబు అన్నారు. ఐదేళ్లు లాభం జరిగిందా? నష్టం జరిగిందా? బేరీజు వేసుకోవాలని కోరారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు నష్టం జరిగిందన్నారు. అందరిపై తప్పుడు కేసులు నమోదయ్యాయని అన్నారు. జగన్ రెడ్డి అహంకారంతో, దోపిడీతో విధ్వంసం చేసి మీ జీవితాలను నాశనం చేశాడన్నారు.

అన్ని వ్యవస్థలను...
రాష్ట్రాన్ని, అన్ని వ్యవస్థలను, అన్ని రంగాలను నాశనం చేశాడన్నారు. నిన్నటి పరదాలు కట్టుకుని వచ్చిన వ్యక్తిమరోసారి మోసం చేయడానికి వస్తున్నాడన్నారు. రాయలసీమకు ఒక్క సాగునీటి ప్రాజెక్టు జగన్ ఇచ్చాడా? అని ప్రశ్నించారు. ఇది తన సవాల్ అని దీనికి జగన్ కు సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఒక్క పరిశ్రమ అయినా తీసుకు వచ్చాడా? అని ప్రశ్నించారు. డీఎస్సీ తీసుకు వచ్చాడా? అని నిలదీశారు. వాలంటీర్ ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్లని అనుకుంటున్నాడని, జగన్ మనస్తత్వం అందరూ ఆయన దగ్గర బానిసలుగా ఉండాలని కోరుకునే వ్యక్తి అని చంద్రబాబు అన్నారు. మీ కష్టాలు తీరాయా? అని అడుగుతున్నానని అన్నారు.
రైతులు బాగుపడ్డారా?
టమాటా, మిరప, పత్తి రైతు బాగున్నాడా? అని చంద్రబాబు ప్రశ్నించారు. మాట్లాడితే రైతు భరోసా కేంద్రం పెట్టానని అంటాడని, అది రైతు దగా కేంద్రమని అన్నారు. సాగునీరు కూడా ఇవ్వలేదన్నారు. ఎక్కడకు వెళ్లినా పిల్లలు తన మీటింగ్ కు ఇచ్చారని, టీచర్ పోస్టులు భర్తీచేశాడా? అని ప్రశ్నించారు. విద్య పైన పెట్టిన ఖర్చు ఎంత? దోచుకున్నదెంతో చెప్పాలని నిలదీశారు. ప్రభుత్వ వైద్య ఆసుపత్రులు బాగుపడ్డాయా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కాంట్రాక్టర్ కు డబ్బులిచ్చి మందులు కూడా కొనుగోలు చేయకుండా దోచుకున్నారన్నారు. చైతన్యం వచ్చి పేదవాడి రాజ్యం రావాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. 2019లో రాయలసీమలో 52 సీట్లు ఉంటే 49 సీట్లలో వైసీపీ గెలిపిచ్చారన్నారు.





Tags:    

Similar News