Chandrababu : చంద్రబాబును చూసి ఈ తరం పొలిటికల్ లీడర్స్ నేర్చుకోవాల్సిందే?

ఏడు పదులు వయసు దాటినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్లేందుకు ఏమాత్రం జంకరు.

Update: 2024-09-02 08:24 GMT

అవును.. ఇది నిజం.. ఏడు పదులు వయసు దాటినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్లేందుకు ఏమాత్రం జంకరు. జనాలు కష్టాల్లో ఉంటే చాలు ఆయన రేయింబవళ్లూ పనిచేస్తారు. ఆయనకు తెలిసిన క్రైసిస్ మేనేజ్‌మెంట్ మెరెవరకీ తెలియదు. ముఖ్యమంత్రి అంటే క్యాంప్ కార్యాలయానికే పరిమితయితే సరికాదు. జనంలోకి వెళ్లాలి. వారికి అందుతున్న సౌకర్యాలను స్వయంగా అడిగి తెలుసుకుంటారు. అధికారులు కూడా అలెర్ట్ అవుతారు. ఉన్నత స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకూ క్షేత్రస్థాయిలో ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ఎక్కువ శ్రమిస్తారు.

నిన్న సాయంత్రం నుంచే...
ముఖ్యమంత్రిగా చంద్రబాబులో ఉన్న గుడ్ క్వాలిటీ అది. కష్టమేంటో ఆయనకు తెలుసు. విజయవాడ వరద నీటిలో మునిగిపోయి ఉంటే నిన్న సాయంత్రం నుంచి అక్కడే మకాం వేశారు. చివరకు మంత్రులు కూడా ఆ పక్కకు రాలేదు. ఎమ్మెల్యేలు కూడా దరిదాపుల్లోకి చేరలేదు. కానీ చంద్రబాబు మాత్రం సింగ్ నగర్ లో మూడు సార్లు పర్యటించారు. సాయంత్రం, రాత్రి కూడా ఆయన పర్యటనలు సాగింది. నీళ్లలో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చారు. వారికి భోజన సదుపాయాలు కల్పించడం కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. ప్రయివేటు హోటల్స్ తో మాట్లాడి భోజనం ఏర్పాట్లు చేశారు. అక్షయ పాత్ర నుంచి భోజనం, మంచినీటి బాటిల్స్ తెప్పించి వారి చేతనే పంపిణీ చేయించారు.
సమీక్షలు చేస్తూనే...
ఒక వైపు అధికారులతో సమీక్షిస్తూనే మరొక వైపు కేంద్రంతో మాట్లాడి మరబోట్లతో పాటు హెలికాప్టర్లను తెప్పించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇటు మంత్రులను, ఎమ్మెల్యేలను వార్డుల వారీగా బాధ్యులను చేస్తూ ఇటు పాలనపరమైన చర్యలు తీసుకున్నారు. ఆస్తి నష్టాన్ని ఎటూ నివారించలేమని తెలుసు.కానీ ఒక్క ప్రాణం కూడా పోకూడదన్న తపన చంద్రబాబులో కనిపిస్తుంది. ఆ కసి ప్రస్తుతం ఉన్న పొలిటికల్ లీడర్లలో కనిపించదు. జనంలోకి వెళ్లేందుకు వాళ్లు సాహసించరు. కానీ చంద్రబాబు మాత్రం అందరికంటే భిన్నం. అందుకే ఆయనను ట్రబుల్ షూటర్ గా పేరుంది. గతంలో విశాఖలో హుద్ హుద్ తుపాను వచ్చినప్పుడు కూడా విశాఖలో బస్సులోనే ఉండి పరిస్థితి సద్దుమణిగే వరకూ అధికారులను నిద్రపోనివ్వలేదు. తాను నిద్రపోలేదు. అలా ఉంటది మరి చంద్రబాబుతోని. హేట్సాఫ్ టు సీబీఎన్.


Tags:    

Similar News