ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రక్షాళన.. రేషన్ డీలర్లపై వేటు
ప్రజా పంపిణీ వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్ ప్రక్షాళన చేయనున్నారు. రేషన్ డీలర్ల వ్యవస్థను రద్దు చేయాలని భావిస్తుంది
ప్రజా పంపిణీ వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్ ప్రక్షాళన చేయనున్నారు. రేషన్ డీలర్ల వ్యవస్థను రద్దు చేయాలని భావిస్తుంది. రేషన్ ను నేరుగా ఇంటికే డెలివరీ చేయడానికి సిద్దమయింది. వాలంటరీ వ్యవస్థ ద్వారా రేషన్ సరుకులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇంటింటికి ప్రతి నెల సరఫరా చేయడానికి ప్రణాళికను సిద్దం చేశారు. ఇందుకు వాలంటీర్లను ఉపయోగించుకుంటుంది. వేలిముద్రలు పడకపోయినా ఆధార్ నెంబర్ ప్రకారం రేషన్ సరఫరాను చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
కలెక్టర్ల సమావేశంలో....
ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదం లభించినట్లు సమాచారం. కొత్త వ్యవస్థ లో రేషన్ డీలర్లు ఉండరు. కలెక్టర్ల సమావేశంలో జగన్ ఈ మేరకు స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ఇకపై వాలంటీర్ల ద్వారా జరుగుతుంది. అందువల్ల రేషన్ డీలర్ల అవసరమే ఉండదు. ఇక దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యాన్ని సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దొడ్డు బియ్యం సరఫరా చేయడం వల్ల ప్రజలు తిరిగి మిల్లర్లు అమ్ముకుంటున్నరని, అందుకే సన్న బియ్యాన్ని సరఫరా చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.