Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది;

Update: 2024-11-29 03:40 GMT

chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేటి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఉదయం 11.15 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయానికి చేరుకుంటారు. ఆయన నేరుగా నారావారిపల్లి నుంచి సచివాలయానికి చేరుకుంటారు. అనంతరం వివిధ శాఖలపై సమీక్ష చేయనున్నారు.

నేటి సమీక్షలు...
ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనపై తదుపరి కార్యాచణపై చంద్రబాబు అధికారులు, మంత్రులతో చర్చించనున్నారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు రెవెన్యూ శాఖపై సమీక్ష చేయనున్నారు. ప్రధానంగా రెవెన్యూ సదస్సులపై ఈ సమీక్షలో చంద్రబాబు అధికారులతో చర్చించనున్నారు. తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల పునర్వ్యస్థీకరణపై కూడా సమీక్ష చేయనున్నారు.


Tags:    

Similar News