PSLV 60 కౌంట్ డౌన్ నేడు

పీఎస్ఎల్వీ 60 ప్రయోగానికి నేడు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రయోగించనున్నారు

Update: 2024-12-29 03:45 GMT

పీఎస్ఎల్వీ 60 ప్రయోగానికి నేడు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. ఈరోజు రాత్రి 8.58 గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. సూళ్లూరుపేటలోని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి రేపు 9.58 గంటలకు పీఎస్ఎల్వీ 60 రాకెట్ ను ప్రయోగించనున్నారు. మొత్తం 25 గంటల పాటు ఈ ర్యాకెట్ కౌంట్ డౌన్ ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

అనేక సేవలకు...
ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రయోగం విజయవంతం అవుతుందని శాస్త్రవేత్తలు నమ్మకంగా ఉన్నారు. ప్రయోగం సక్సెస్ అయితీరుతుందన్న ధీమా వారిలో వ్యక్తమవుతుంది. నానో శాటిలైట్ లను కక్షలోకి ఇస్రో శాస్త్రవేత్తలు పంపనున్నారు. మానవ అంతరిక్షయానం, ఫార్మేషన్ ఫ్లయింగ్, స్పేస్ డాకింగ్ వంటి వాటికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రెండు ఉపగ్రహాల బరువు 44 కిలోలుగా ఉ:దని చెప్పారు.



ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

 


Tags:    

Similar News