Durga Gudi : దుర్గగుడిలోనూ కల్తీ నెయ్యేనటగా?

విజయవాడ దుర్గగుడిలోనూ ఆవునెయ్యి శాంపిల్స్ ను ఫుడ్ సేప్టే అధికారులు పరిశీలించారు. కొంత నాణ్యత తగ్గినట్లు గుర్తించారు

Update: 2024-09-24 12:45 GMT

దుర్గగుడిలోనూ ఆవునెయ్యి శాంపిల్స్ ను ఫుడ్ సేప్టే అధికారులు పరిశీలించారు. కొంత నాణ్యత తగ్గినట్లు గుర్తించిన అధికారులు వాటిని పరీక్షలకు పంపారు. 1,110 కేజీల జీడిపప్పు, నాలుగు లారీ లోడుల కందిపప్పు, కిస్ మిస్ ను వెనక్కు పంపినట్లు తెలిసింది. బెల్లం, ఆవునెయ్యి శాంపిల్స్ ను సేకరించిన ఫుడ్ సేఫ్టే అధికారులు వాటిని హైదరాబాద్ ల్యాబ్ కు పంపారు.

నాణ్యత ప్రమాణాలను...
FSSI నిబంధనల ప్రకారం నాణ్యత ప్రమాణాలను పాటించడం లేదని గుర్తించినట్లు తెలిసింది. దీనిపై పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు తెలిసింది. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు సిఫార్సు చేసినట్లు చెబుతున్నారు. గత కొంత కాలంగా నాసిరకం వస్తువులను దుర్గగుడి ప్రసాదం, అన్నదానం తయారీలో వినియోగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Tags:    

Similar News